Friday, April 3, 2009

నామ రామాయణం

శుద్ద బ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మద్యమరప్రార్థిత రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ


చంద్ర కిరణ కుల మండన రామ
శ్రిమద్ధశరథ నందన రామ
కౌసల్యాసుఖ వర్ఠన రామ
విశ్వామిత్ర ప్రియతమ రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ


ఘోర తాటకా ఘాతుక రామ
మారీచాది నిపాతక రామ
కౌశిక మఖ సంరక్షక రామ
శ్రీమదహల్యోద్దారక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ


గౌతమముని సంపూజిత రామ
సురమునివరగణ సంస్తుత రామ
నావికధావిత మృదుపద రామ
మిథిలా పురజన మోహక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ


విదేహ మానస రంజక రామ
త్ర్యంబకకార్ముకభంజక రామ
సీతార్పిత వరమాలిక రామ
కృతవైవాహికకౌతుక రామ

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ


భార్గవదర్ప వినాశక రామ
శ్రీమదయోధ్యాపాలక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీత రామ

No comments:

Post a Comment